తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు..
మియాపూర్ పోలీసుల పనితీరు భేష్..
Miyapur police are doing a great job.
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (వాయిస్ టుడే):
తప్పిపోయిన ఐదేళ్ల బాలుడిని క్షేమంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంలో మియాపూర్ పోలీసులు అప్రమత్తత, మానవత్వాన్ని చాటుకున్నారు. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కుమారుడు సిద్ధార్థ్ (5) సోమవారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ దారి తప్పి సుమారు ఒక కిలోమీటర్ దూరం వెళ్లి కనిపించకుండా పోయాడు.
ఈ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఆదేశాల మేరకు రెండు గంటల పాటు శ్రమించి బాలుడి వివరాలను సేకరించారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులను గుర్తించి, క్షేమంగా వారికి అప్పగించారు.
బాలుడి కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకుంటున్న సమయంలోనే పోలీసులు ముందస్తుగా స్పందించి తమ బిడ్డను సురక్షితంగా అప్పగించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మియాపూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.


