ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు

- Advertisement -

ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు
సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపు నియోజకవర్గంలో ముస్లింలకు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో మజీద్, షాది ఖానా, కబ్రస్తాన్ వంటి సమస్యలను ఆయా గ్రామాల్లో ముస్లిం నాయకులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి, కట్టుబడి ఉందని ఆ దిశలో తాను కూడా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular