- Advertisement -
దవఖాన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం
MLA Goodem inaugurated the hospital building
సంగారెడ్డి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గురువారం నాడు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో ఒక కోటి 68 లక్షల రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసారు.
పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ అభివృద్ధిలో పరిశ్రమలు భాగస్వాములు కావడం అభినందనీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు,గురువారం రుద్రారం గ్రామ పరిధిలోని తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దవఖాన భవనం,మూడు ఆర్వో ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం 60 లక్షల రూపాయల గ్రామపంచాయతీ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రతి పల్లె దవాఖానాలో వైద్యుడు తో పాటు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ పాండు, మండల పంచాయతీ అధికారి హరిశంకర్ గౌడ్, ఈవో రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నే రాజు మరియు వెంకన్న, బలరాం, తోషిబా సంస్థ ప్రతినిధి రామకృష్ణ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -