- Advertisement -
డయాలిసిస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలేరు
MLA Kaleru who started the dialysis center
హైదరాబాద్
పేద ప్రజలకై కోటి రూపాయల ఖర్చుతో అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎంసిహెచ్ కాలనీలో నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు డయాలసిస్ తో ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి ఈ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక రోజులో 20 మంది పేషెంట్స్ కు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని అలాగే ఒక ఐరన్ ఇంజక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పేద ప్రజలు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా ఇక్కడకు వచ్చి మెరుగైన వైద్యాన్ని అందుకోవాలని ఎమ్మేల్యే కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -