- Advertisement -
అజ్మీర్ దర్గా ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే కన్నా
MLA Kanna at Ajmer Dargah Urusu Mahotsav
సత్తెనపల్లి,
సత్తెనపల్లి పట్టణం 28వ వార్డు నందు అజ్మీర్ దర్గా ఉరుసు (గంధం) మహోత్సవంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమం అనంతరం వార్డులోని సచివాలయాన్ని సందర్శించారు. స్థానిక శివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది గురించి ఆరా తీశారు. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల దగ్గర నుంచి సిబ్బంది ఎవరైనా లంచం తీసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనిచేయు వేళల్లో విధులు నిర్వహించకుండా కార్యాలయాన్ని వదిలి బయటకు వెళ్తే వారిని సస్పెండ్ చేస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -