Monday, January 13, 2025

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

- Advertisement -

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్

MLA KE Shyam Kumar who started the midday meal scheme

విద్యార్థులతో కలిసి  మధ్యాహ్న భోజనాన్ని తిన్న ఎమ్మెల్యే శ్యాం కుమార్
పత్తికొండ

పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థిని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్. పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత గానో కృషి చేస్తుందని అందులో భాగంగానే ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో భరత్ నాయక్ పత్తికొండ సిఐ జయన్న పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తోంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ చదువు కోసం గ్రామీణ ప్రాంత విద్యార్థులు మండల, నియోజకవర్గ కేంద్రాలలో చదువుల కోసం వచ్చే విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడకుండా జూనియర్ కళాశాలలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇంటి దగ్గర నుండి నేటివ్ గ్లాస్ తీసుకురానవసరం లేదని అందుకోసం ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ గారు 40 వేల రూపాయలతో ప్లేట్లు గ్లాసులు కొనుగోలు చేసేందుకు ప్రిన్సిపాల్ కు నగదును అందజేశారు.2014-19 మధ్య ఇంటర్ విద్యార్థులకు సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం  ఆ పథకాన్ని రద్దు చేసింది.ఈ విషయంపై 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ యువగళం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు నారా లోకేశ్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. యువ గళం పాదయాత్రలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈరోజు నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు తమ ఇంటి వద్ద నుండి లంచ్ బాక్సులు తీసుకురానవసరం లేదని ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్