నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్

- Advertisement -
MLA Maganti Gopinad filed the nomination
MLA Maganti Gopinad filed the nomination

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం నామినేషన్ దాఖలు చేసారు.  బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లోని షేక్పేట తహసిల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేసారు. మాగంటి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృపంలోని బి.ఆర్.ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి తమను అధికారంలోకి తీసుకొని వస్తాయని అన్నారు.  తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి అవకాశం కల్పించారు.  నియోజకవర్గంలోని కీలక సమస్యలన్నిటిని పరిష్కరించడమే కాక పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన తమకే ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు.  మాజీ మంత్రి ప్రజానాయకుడు జనార్దన్ రెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తమతో కలిసి రావడం తమకు మరింత బలాన్ని చేకూర్స్తుందని అన్నారు.  పేదల నేతగా పేరొందిన జనార్దన్ రెడ్డి తనయుడికి పేద ప్రజల మద్దతు ఉంటుందని అదంతా తమకు కలిసి వచ్చే అంశం అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కెసిఆర్  సొంత కొడుకులా తమకు ఆహ్వానం పలికారని మాగంటి గోపీనాథ్ అన్న గెలుపుకు అహర్నిశలు పాటుపడతామని అన్నారు.

MLA Maganti Gopinad filed the nomination
MLA Maganti Gopinad filed the nomination
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular