- Advertisement -
కడియంపై మండిపడ్డ ఎమ్మెల్యే పల్లా
MLA Palla got angry at Kadiam
జనగామ
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే పై కడియం శ్రీహరి బిఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాడు జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అయనపంపిణీ చేసారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకుల శ్రమ,పార్టీ జండాతో స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కడియం శ్రీహరి నీకు సిగ్గు,శరం ఉంటే మా పార్టీ బిక్షతో గెలిచిన నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా. మా నాయకులు,ప్రజలు నీకు గోరి కడతారని అన్నారు.
కడియం శ్రీహరి నీకు బిక్ష పెట్టిన కేసీఆర్ పై అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు. ఖబాడ్ధార్ బిడ్డ స్టేషన్ ఘనపూర్ ప్రజలు,బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీకు బుద్ధి చెబుతారు. పొద్దు తిరుగుడు పువ్వు లాగా పార్టీలు మారే నువ్వు కెసిఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
- Advertisement -