తుమ్మలను కలిసిన ఎమ్మెల్యే పోదేం వీరయ్య

- Advertisement -

భద్రాచలం, సెప్టెంబర్ 11  ( వాయిస్ టు డే ): మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పోదేం వీరయ్య సోమవారం కలిశారు.  దమ్మపేట మండలం గండుగులుపల్లి లోని  తుమ్మల నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఎమ్మెల్యే వీరయ్య తెలిపారు. వీరయ్య తో పాటు  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్య లో వెళ్లి తుమ్మలను కలిశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఎడవళ్లి కృష్ణ, తాటి వేంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్, బోగాల శ్రీనివాసరెడ్డి, చింతిర్యాల రవికుమార్, సరెళ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular