- Advertisement -
భారీ ఆంజనేయ విగ్రహ నిర్మాణం పనులకు శంకుస్థాపన–ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
MLA Raj Tagore lays foundation stone for construction of huge Anjaneya statue
గోదావరిఖని
రాముడు నడిచిన నేలగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద దాసాంజనేయ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు శంకుస్థాపన చేశారు. వసంత పంచమి సందర్భంగా 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే రాముని గుండాల పేరిట ఆధ్యాత్మిక కేంద్రం ఉండగా, ఇటీవల 1800 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆంజనేయస్వామి విగ్రహం బయల్పడింది. ఈ క్రమంలో అవిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ ప్రాంతంలో 108 అడుగుల దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించటతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -