- Advertisement -
శింగనమలలో డొక్కా సీతమ్మ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ
MLA Sravanisree who started the Dokka Seethamma scheme in Singanamala
శింగనమల
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేసింది.ఈ నేపథ్యంలో శింగనమల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.
ఎంతోమంది ఆకలి తీర్చి చరిత్రలో నిలిచిపోయిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరును ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఈ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -