- Advertisement -
దైద అమరలింగేశ్వరస్వామి పూజలో ఎమ్మెల్యే యరపతినేని
MLA Yarapatineni in Daida Amaralingeshwara Swamy Pooja
గురజాల,
గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు బుధవారం గురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, కృష్ణానది ఒడ్డున సహజ సిద్ధంగా కొండబిలం లోపల వెలసిన అమర్ లింగేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితుడని అన్నారు. పల్నాడు జిల్లాలో దైదను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు దేవాలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యరపతినేని శ్రీనివాసరావు తో పాటు తెలుగుదేశం, జనసేన, బిజెపి, పార్టీలకు చెంది వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -