- Advertisement -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యేలు
MLAs inspected the flooded areas
భీమవరం
భారీ వర్షాలు, బుడమేరు వరద ముంపు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.నాగరాణి, , కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తో కలపసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కొల్లేరు పరివాహక ముంపు ప్రాంతాలను, ఉప్పుటేరు పరివాహ ప్రాంతాలను పరిశీలించారు,.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజలు వరద ప్రవాహానికి ఎదురుగా నడిచి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని అన్నారు.
కొల్లేరు సరిహద్దు గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు వరదలు అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయని ఇలాంటి నీరు వర్షాకాలంలో చాలా సార్లు చూసామని ధీమాతో కాకుండా జాగ్రత్త వహించి నడుచుకోవాలని అన్నారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని, ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి రావాలని, పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలను అధికారులు కలగచేసాం. ఏదైనా ప్రమాద సంకేతాలు గానీ సమాచారం గానీ ఉంటే డయల్ 112 కు సమాచారం అందిస్తే వెంటనే పోలీసు వారి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు.
- Advertisement -



