సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ .

- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ .
హైదరాబాద్

MLC Balmoor Venkat counters KTR’s comments on CM Revanth Reddy.
విద్యకు, క్రీడలకు ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు, యువతకు ఆదర్శం. ఏ వయసులోనైనా కొత్తది నేర్చుకోవాలి,చదువుకోవాలంటూ హార్వర్డ్ యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి  మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, దానిపై కూడా హేళనగా మాట్లాడటం, కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో రైజింగ్ తెలంగాణ విజన్ ను చెప్పి..అక్కడి మన తెలుగు విద్యార్థులను ఆకట్టుకున్నారు. మీలా విదేశాలలో యూనివర్సిటీ ప్రోగ్రామ్ ల పేరుతో డ్రగ్స్ కల్చర్ ను ప్రమోట్ చేయలేదు. పదేళ్లు నువ్వు విదేశాల్లో తిరిగి ఒరగ బెట్టింది ఏంటో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. క్రీడలను ప్రమోట్ చేయడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వరల్డ్ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సితో మ్యాచ్ ఆడితే…దానిని కూడా ఎద్దేవా చేసినట్లు మాట్లాడి నీ నీచపు బుద్ధి చూపించావని అన్నారు.
ఇక సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ ను పిలిస్తే.. తెలంగాణ అస్థిత్వాన్ని ముట్టినట్లు అని మాట్లాడిన కేటీఆర్, పదేళ్లు అధికారం ఇస్తే… తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసి, రాష్ట్రాన్ని దివాళా తీయించిన రాబందులు మీరు కాదా. ఈ రోజు తెలంగాణలోని విద్యార్థులకు, యువతకు స్పూర్తి నిచ్చేలా ముఖ్యమంత్రి కార్యక్రమాలు చేస్తుంటే అభినందించాల్సింది పోయి… ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకోకపోతే… ప్రజలు నీకు మరోసారి సరైన గుణపాఠం చెబుతారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular