ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
MLC Jeevan Reddy's comments are ridiculous
ప్రజాస్వామ్యంలో దాడులు సరికావు
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యమ్
జగిత్యాల
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా అమలు చేయవచ్చునని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఇవి చేతగాని పరిపాలనకు నిదర్శనం అని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ ధర్మపురి మాజీ అసెంబ్లీ కన్వీనర్ కస్తూరి సత్యం విమర్శించారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హామీల అమలులో విఫలం అయినందునే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. హామీల అమలు కోసం బీజేపీ పోరాటం చేస్తే జీర్ణించుకోలేక అధికారం ఉందనే అహంకారంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయం పై కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగడం సరికాదని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటని అన్నారు. ఆరు గ్యారంటీలలో మూడు గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేశామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా ఆని మర్రిపెల్లి సత్యం, కస్తూరి సత్యం
సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గల పల్లెలకు ఇంతవరకు పచ్చ బస్సు సౌకర్యం కూడా లేదని అలాంటప్పుడు ఉచిత బస్సు ప్రయాణం సంపూర్ణంగా ఎలా అమలైనట్లు అవుతుందని ప్రశ్నించారు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బస్సుల సంఖ్యను కుదించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు విషయములో ప్రజల దృష్టిని మళ్లించడానికి పార్లమెంటులో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దళిత సంఘాల నాయకులతో నిరసనలు చేయించడం సరికాదన్నారు. అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీయే అని అందులో రెండు సార్లు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో నెహ్రు ఇంట్లో పని మనిషిని పోటీకి దింపి ఓడించిందన్నారు. చివరకు భారతరత్న ప్రకటించి కూడా ప్రధానం చేయకుండా అగౌరవపరిస్తే బిజెపి అధికారంలోకి వచ్చాక భారతరత్న ప్రధానం చేసినటువంటి పార్టీ బిజెపి అనే విషయాన్ని దయచేసి దళిత సంఘాలు గుర్తుంచుకోవాలని అన్నారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని అన్నారు. ఇటీవల మల్యాల మండలంలో నులిగొండ సురేష్ అనే కార్యకర్త కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించినందుకు రాత్రంతా మల్యాల పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురి చేశారని ఈవిషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దాడులు కొత్త కాదని నరహంతకు నక్సరైట్ల తూటాలకు భయపడని చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తే బిజెపి పార్టీ ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉందని కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు సరికాదనే నైతిక విలువలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ మండల నాయకులు అనుమాండ్ల రాఘవరెడ్డి, ఉట్కూరి శ్రీనివాస రెడ్డి,లక్కాకుల వెంకటేష్, చెవులమద్ది శేఖర్,బోయపోతు రాజు తదితరులు పాల్గొన్నారు.