ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు–పోలీసులకు పిర్యాదు

- Advertisement -

ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు–పోలీసులకు పిర్యాదు

MLC Kavitha's photos are being morphed--complaint to the police

హైదరాబాద్
సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని  తెలంగాణ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ హైద్రాబాద్,సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేసింది. తెలంగాణ జాగృతి నాయకురాలు,ఎమ్మెల్సీ కవితపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచరులు కవిత ఫోటో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక మహిళా పై ఇలాంటి దుష్ప్రచారం జరుగుతుందని సైబర్ క్రైం లో పిర్యాదు చేస్తే కనీసం పిర్యాదు కూడా తీసుకోకుండా పోలీసులు వివక్ష చూపిస్తున్నారని  తెలంగాణ జాగృతి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గౌడెల్లి.చెంద్రశేకర్ మండిపడ్డారు. బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందంతో బిఆరెస్ పై కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.పోలీసులు ఒకే పక్షాన వ్యవహరించడం సరికాదని ఆరోపించారు.సైబర్ క్రైం లో కేసు తీసుకోకపోయిన కోర్టు ద్వారా నిందుతులపై చర్యలు తీసుకునేవిధంగా పోరాడుతామని అన్నారు.అరవింద్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మనుకోకుంటే జాగృతి విద్యార్థులు నిన్ను తిరగనియకుండా అడ్డుకుంటామని చెంద్ర శేఖర్ హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular