దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’కు ఎంపికైన బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసానికే ఠాకూర్ కుటుంబాన్ని ఆహ్వానించారు. ఠాకూర్ కుమారుడు, జేడీ(యూ) నేత రామ్‌నాథ్ ఠాకూర్ సహా కుటుంబసభ్యులతో మోదీ ముచ్చటించారు.
‘‘జన నాయకుడు కర్పూరి ఠాకూర్ కుటుంబాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. సమాజంలోని వెనకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు ఆయన అండగా నిలిచారు. ఆయన జీవితం, ఆదర్శ సూత్రాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’’ అని మోదీ పేర్కొన్నారు. తన తండ్రిని ‘భారత రత్న’తో గౌరవించినందుకు ప్రధానికి రామ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణాలు తమకు మరో దీపావళి అంటూ హర్షం వ్యక్తం చేశారు.
అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం కృషి చేసిన కర్పూరిని.. ఇటీవల కేంద్రప్ర భుత్వం భారతరత్నతో గౌరవించింది. కొన్ని రోజుల వ్యవధిలోనే భాజపా అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ, పీవీ నరసింహారావు, ఎంఎస్ స్వామినాథన్, చరణ్ సింగ్ చౌధరిలకు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
కర్పూరి ఠాకూర్ కుటుంబాన్ని మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -
- Advertisement -



