Monday, December 23, 2024

మోదీ పక్కా లోకల్…. మరి సోనియా ఎక్కడి నుండి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలే

- Advertisement -

మోదీ పక్కా లోకల్….

మరి సోనియా ఎక్కడి నుండి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలే

బండి సంజయ్

వేములవాడ

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్న వేములవాడ జనసభలో ఎంపి బండి సంజయ్ ప్రసంగానికి ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ప్రధాని సాక్షిగా కాంగ్రెస్ పై పంచ్ ల వర్షం కురిపించారు బండి సంజయ్. బండి సంజయ్ పంచ్ లకు ఈలలు, చప్పట్లతో వేములవాడ జనసభ మారుమోగింది. మోదీ పేరును ప్రస్తావించినప్పుడల్లా జనాలు ఈలలతో హర్షధ్వానాలు పలికారు. బండి సంజయ్ మాట్లాడుతూ కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపమే నరేంద్రమోదీ. దేశ చరిత్రలో తొలిసారి దక్షిణకాశీకి విచ్చేసిన నాయకుడు మోదీ మాత్రమే. మోదీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్రను కాంగ్రెస్ చేస్తోంది. మోదీకి ఆస్తిపాస్తులు… బ్యాంకు బ్యాలెన్స్ లేవు. ప్రధాని పదవి వద్దనుకుంటే జబ్చకు సంచి వేసుకుని పోయే మహనీయుడు మోదీ. నా మోదీని కించపరుస్తున్న కాంగ్రెస్ నేతలారా…ఖబడ్దార్. నా మోదీ మొండిమొలోడు కాదు… ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ను మెడలు పట్టి బయటకు గెంటేసిన జగమొండి. 370 ఆర్టికల్ ను రద్దు చేసి ఏక్ దేశ్ మే దో విధాన్…దో ప్రధాన్…దో నిషాన్ నహీ చలేగా అంటూ నినదించిన నా శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను అమలు చేసి వేలాది మంది బలిదానాలకు సార్ధకత చేకూర్చిన జగమొండి నా మోదీ. ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి.. ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించిన జగమొండి మోదీ. హిందువుల 5 వందల ఏళ్ల నాటి కల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యాన్ని స్వహస్తాలతో నెరవేర్చిన జగమొండి నా మోదీ . కరోనా వ్యాక్సిన్ అందించి 140 కోట్ల మంది ప్రజలకు ప్రాణాలను కాపాడిన జగమొండి నా మోదీ. మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6 వేల కోట్లకుపైగా వెచ్చించి తెరిపించిన జగమొండి నా నరేంద్రమోదీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన జగమొండి నా మోదీ. నరేంద్ర మోదీ ‘మేడ్ ఇన్ భారత్’… మరి సోనియా మైనో, రౌల్ విన్సీ ఎవరు? …మేడ్ ఇన్ ఇటలీ. మా భారతీయ జనతా పార్టీ మేడ్ ఇన్ ఇండియా… మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది మేడ్ ఇన్ బ్రిటీష్. నా మోదీ పక్కా లోకల్. మరి సోనియా ఎక్కడి నుండి వచ్చిందో కాంగ్రెస్ చెప్పాలే. పక్కా లోకల్ మోడీ కావాలా? నాన్ లోకల్ రాహుల్ విన్సీ, సోనియా మైనో కావాల్నా. మేడ్ ఇన్ భారత్ పార్టీ కావాల్నా?? మేడ్ ఇన్ బ్రిటన్ పార్టీ కావాలా. 6 గ్యారంటీలను అడిగితే కాంగ్రెస్ నేతలు గాడిద గుడ్డు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు. 6 గ్యారంటీల అమలును చేయమంటే ఇచ్చింది గాడిద గుడ్డు. 2లక్షల రైతు రుణమాఫీ చేయాలని అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. వరికి రూ.500ల బోనస్, తాలు, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనమని అడిగితే మన చేతికి ఇచ్చింది గాడిద గుడ్డు. రైతులు, కౌలు రైతులకు 15వేలు, రైతు కూలీలకు 12 వేలు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. విద్యార్థులకు రూ.5లక్షల కార్డు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. వ్రుద్దులకు, నిరుద్యోగ భ్రుతి రూ.4 వేల పెన్షన్ అడిగితే ఇఛ్చింది గాడిద గుడ్డు. మహిళలకు 2,500లు అడిగితే ఇచ్చింది గాడిద గుడ్డు. అసలు కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే పెద్ద గాడిద గుడ్డు. ఆ పార్టీ గుర్తు హస్తం కాదు… గాడిద గుడ్డు మాత్రమే. అరడుగుల బుల్లెట్ మన నరేంద్ర మోడీ. ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ చోర్ బ్యాచ్. అరడుగుల బుల్లెట్ మోదీ కావాలా?? లేక చొర్ బ్యాచ్ కాంగ్రెస్ కావాలా? మోదీ ఏ పని చేపట్టినా వాళ్ల అమ్మ ఆశీస్సులు తీసుకుని బయటకువస్తారు. ఇప్పుడు వారికి అమ్మ లేరు. మనమంతా మోదీ పక్షాన ఉంటూ ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసుకుందామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్