మోడీ వర్సెస్ సంఘ్…
న్యూఢిల్లీ, జూన్ 26,
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి క్లీన్ మెజారిటీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటులో మిత్ర పక్షాలపై ఆధార పడటంతో అడుగడుగునా ప్రధాని మోదీకి సవాళ్ల ఎదురవుతున్నాయి. గతంలో మోదీని గ్లోబల్ లీడర్‌గా ప్రమోట్ చేసిన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే ఆయనకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతున్నారన్న వార్తలు పెరుగుతున్నాయి. గతంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న మోదీ, అమిత్ షా ఎన్డీఏ 3.0లో అలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ నిర్ణయాలే కాదు.. పార్టీలో కూడా ప్రధాని మాట ఏకపక్షంగా జరిగే అవకాశం లేదు.ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డానే మోడీ తన కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు. దీంతో.. బీజేపీ కొత్త సారధిని ఎన్నుకునే పనిలో పడింది. ఈ విషయంలోనే మోదీ, ఆర్ఎస్ఎస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో నడుస్తోంది. మోదీ ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టేలా, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం అనే సంకేతాలను పంపేందుకు రాజ్‌నాథ్ సింగ్ లేదా శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరును ఆర్ఎస్ఎస్ పరిశీలిస్తోంది. కానీ, మోదీ మాత్రం సునీల్ బన్సాలీ లేదా మహరాష్ట్రకు చెందిన వినోద్ తావ్డేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.ప్రభుత్వం, పార్టీలో ఏక పక్ష నిర్ణయాలు ఉండకుండా చేయాలంటే మోదీ కంటే సీనియర్లు అయిన రాజ్‌నాథ్ సింగ్ లేదా శివరాజ్‌సింగ్ చౌహాన్ ను అధ్యక్షునిగా నియమించాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతోంది. అవసరమైతే వీరిద్దరూ మోదీ నిర్ణయాలను వ్యతిరేకించేంత బలం ఉన్న నాయకులు. పార్టీలో స్వేచ్చగా నిర్ణయాలు తీసుకుంటారని ఆర్ఎస్ఎస్ ఆలోచన. అయితే, మోదీ, అమిత్ షా మాత్రం వీళ్లద్దరికి పార్టీ బాధ్యతలు ఇవ్వకూడదని ఆలోచిస్తున్నారు. మోదీకి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ అవుతారనే మొన్నటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజార్టీతో గెలిచినా..ఆయనకు సీఎం పగ్గాలు ఇవ్వకుండా కొత్తవారిని తీసుకొచ్చారు. ఇక రాజ్‌నాథ్ సింగ్ గత పదేళ్లుగా కేంద్ర కేబినెట్‌లో ఉన్నప్పటికీ.. మోదీ, అమిత్ షా కంటే తక్కువ పోర్టు పోలియో ఉన్న శాఖలను ఇస్తున్నారు. ఇలా వీరిద్దరినీ మోదీ తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోవడంతో ఆర్ఎస్ఎస్ రూపంలో మోదీకి ఎదురుగాలి కనిపిస్తోంది. జాతీయ అధ్యక్షుని విషయంలోనే కాకుండా తెలంగాణ పార్టీ బాధ్యతల విషయంలోనూ, మంత్రివర్గం ఏర్పాటులో కూడా ఆర్ఎస్ఎస్ దే పైచేయి కనిపిస్తోంది.నిజానికి తెలంగాణ నుంచి ఈటల రాజేందర్‌ను కేంద్ర కేబినెట్ లో తీసుకుంటారని అంతా భావించారు. అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈటల రాజేందర్ ఒత్తిడితో బండి సంజయ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. కాబట్టి.. కేంద్ర పెద్దల దగ్గర ఈటలకు పలకుబడి ఉందని.. అందుకే ఆయన్ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఎన్నికల ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో.. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ను బండి సంజయ్‌కు మంత్రి పదవి వరించింది.ఇక.. ఈటల రాజేందర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని నిన్న, మొన్నటి వరకూ జోరుగా ప్రచారం జరిగినా.. ఇప్పుడు కౌంటర్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మనసులో రామ్ చందర్ రావు, మనోహర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. 10 రోజుల క్రితం కూడా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం అంటే శత్రువు కాదని.. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని అన్నారు. అంటే మోదీని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారని క్లియర్ గా అర్థం అవుతోంది. దీంతో.. ప్రధాని మోదీకి ఆర్ఎస్ఎస్ అడ్డుపుల్లలు వేస్తుందని స్పష్టం అవుతుంది.
మోడీ వర్సెస్ సంఘ్…
- Advertisement -
- Advertisement -