తెలుగుదేశం జనసేన పార్టీలకు 150 పైగా అసెంబ్లీ సీట్లు
వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు
వచ్చే ఎన్నికల్లో వైకాపాకు బోటా బోటి సీట్లు
జగన్ ను పులివెందుల నియోజవర్గ ప్రజలే నమ్మడం లేదు
82 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనని జగన్ ఇప్పటికే చెప్పేశాడు
వైకాపాకు భూస్థాపితం తప్పదు
మాజీమంత్రి వెంకట గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
బద్వేలు
జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన జనసేన సంయుక్తంగా 150 పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని మాజీమంత్రి తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు బుధవారం
బద్వేలు సమీపంలోని గోపవరం మండలంలో ఆయన పత్రిక విలేకరులతో మాట్లాడుతూ వైకాపాకు భూస్థాపితం తప్పదని తెలిపారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 82 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిపారు తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తూ డబ్బు మీద ఆశతో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు అభివృద్ధి అంటే
జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తెలియదన్నారు పులివెందుల నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎంత మాత్రం నమ్మడం లేదన్నారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా అతి తక్కువ
స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు వైకాపా పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు నమ్మడం లేదన్నారు కొందరు ఎమ్మెల్సీలు కూడా వైకాపాను వీడెందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు జగన్మోహన్
రెడ్డి రాజకీయంగా ఎప్పుడో దిగజారి పోయినట్టు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసిన జరగబోయే ఎన్నికల్లో ఫలితం ఉండకపోవచ్చునున్నారు తెలుగుదేశం జనసేన పార్టీలను
ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బద్వేలు అసెంబ్లీ లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తుందని తెలిపారు బద్వేలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి చేసిన
పాదయాత్ర ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు రితేష్ కుమార్ రెడ్డికి ఆయన ఆశీస్సులు అందించారు రితేష్ చేసిన పాదయాత్రకు ప్రజల ఆశీస్సులు ఊహించని స్పందన వచ్చిందని మాజీ మంత్రి ఆనం
రామ నారాయణరెడ్డి తెలిపారు రితేష్ ముగింపు పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు విలేకరుల సమావేశంలో క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఒద్దిబోయిన ప్రసాద్ రెడ్డి గోపవరం మండల జెడ్పిటిసి సభ్యుడు జయరాం
రెడ్డి బద్వేలు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి పాల్గొన్నారు


