ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు(ITRs) దాఖలు చేసేందుకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు పోటెత్తుతున్నారు..

శనివారం ఒక్కరోజే 1.78 కోట్ల మంది ఈ పోర్టల్‌లో విజయవంతంగా లాగిన్ కాగా.. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 46లక్షల మందికి పైగా లాగిన్ అయినట్టు ఐటీ శాఖ వెల్లడించింది. వీరిలో ఈ మధ్యాహ్నం 1గంట వరకు 10.39లక్షల మంది ఐటీఆర్‌లను ఫైల్ చేయగా.. చివరి గంట వ్యవధిలోనే 3.04లక్షల మంది దాఖలు చేసినట్లు తెలిపింది. దీంతో ఇప్పటివరకు (30వ తేదీ మధ్యాహ్నం 1గంట వరకు) ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 5.83 కోట్లు దాటింది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడంలో ఏవైనా సమస్యలు ఉంటే
orm@cpc.incometax.gov.in ను కాంటాక్టు చేయాలని ఐటీశాఖ ట్విటర్‌లో సూచించింది..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గత మదింపు సంవత్సరంలో 7.4 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 5.83 కోట్ల మంది చేశారు. గతేడాదితో పోలిస్తే దాదాపు 2 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేయల్సి ఉంది. గత వారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. గడువు పెంచాలనే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని, అందువల్ల పన్ను చెల్లింపుదారులందరూ వెంటనే రిటర్నులు దాఖలు చేయాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో గడువును పెంచుతారా లేదా అనే సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది..



