ఖమ్మం తెలంగాణ భవన్ లో బతుకమ్మ వేడుకల్లో ఎంపీ వద్దిరాజు
MP Vaddiraju at Bathukamma celebrations at Telangana Bhavan in Khammam


బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం లో బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్ లో బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బతుకమ్మ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాళ్ల ఉపేందర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వారితో పాటు
ఖమ్మం నగర ప్రముఖులు ఆకుల గాంధీ,బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్,పగడాల నాగరాజు,శీలంశెట్టి వీరభద్రం,బమ్మెర రాంమూర్తిలు తదితర ప్రముఖులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి, బతుకమ్మలను తలపై పెట్టుకుని ఈ వేడుకలలో పాల్గొన్నారు


