ఎంపీ వద్దిరాజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన*
MP Vaddiraju Ravichandra visited Sri Varanasi with his family members.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఎంపీ రవిచంద్ర ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం తన ధర్మపత్ని విజయలక్ష్మీ,కుమార్తె డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలతో కలిసి కలియుగ ఇష్టదైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వారు గుడి చెట్టు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టి తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు.ఈ సందర్భంగా వేద పండితులు సాదర స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఆశీర్వచనాలు పలికారు *తెలంగాణ అష్టైశ్వర్యాలతో వర్థిల్లాల్లి: ఎంపీ రవిచంద్ర* తెలంగాణ రాష్ట్రం పాడిపంటలు అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని,ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శ్రీవేంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.తమ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో ప్రజా జీవితంలో నిండూ నూరేళ్లు జీవించాలని ఎంపీ రవిచంద్ర శ్రీవేంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.