ఎంపీ వద్దిరాజు కార్యకర్తలకు మార్గనిర్దేశనం
MP Vaddiraju’s guidelines for activists



జూబ్లీహిల్స్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఘన విజయం చేకూర్చేందుకు మనమందరం మరింత చురుగ్గా ముందుకు సాగాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కార్యకర్తలకు పిలుపునిచ్చారు.యూసఫ్ గూడలో మంగళవారం ఆయన బస్తీ దవాఖానను సందర్శించిన తర్వాత ప్రగతినగర్ లో ముఖ్య కార్యకర్తలతో కొద్దిసేపు సమావేశమయ్యారు.ప్రతి ఇంటికి వెళ్లి ఏ ఒక్క ఓటరును కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో జరిగిన అభివృద్ధిని, రేవంత్ రెడ్డిలో నెలకొన్న దారుణ పరిస్థితులను వివరించాల్సిందిగా ఎంపీ రవిచంద్ర వారికి మార్గనిర్దేశనం చేశారు.పార్టీ కోసం,మన అభ్యర్థి విజయం కోసం కష్టించి పని చేసే వారిని అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పారు. పార్టీ నాయకుడు నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ రవిచంద్ర, సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్, వాసాల వెంకటేష్, పర్వతం సతీష్,కోట్ల వినోద్, పవన్ రెడ్డిలు ఆయన చేత కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో నాయకులు ఫయీమ్, ప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


