ఖమ్మం నగరంలోని సీక్వెల్ ప్రాంగణంలో ఈనెల 23వతేదీ గురువారం సాయంత్రం 6గంటలకు మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనం
మున్నూరుకాపుల సంక్షేమం, ఉన్నతికి చేయూతనిచ్చిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని , మంత్రి పువ్వాడ విజయాన్ని కాంక్షిస్తూ సమ్మేళనం ఏర్పాటు
సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేయనున్న ఎంపీ రవిచంద్ర
ఖమ్మం నగరంలోని సీక్వెల్ ప్రాంగణంలో ఈనెల 23వ తేదీ గురువారం సాయంత్రం 6గంటలకు మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది.ఇందుకు సంబంధించి ఖమ్మం బురహాన్ పురంలోని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో సోమవారం సాయంత్రం సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, ప్రముఖులు పొన్నం వెంకటేశ్వర్లు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మున్నూరుకాపుల సంక్షేమం,ఉన్నతి,సముద్దరణకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసిన కృషిని గుర్తు చేశారు.ఆత్మగౌరవ భవన నిర్మాణానికి హైదరాబాద్ కోకాపేటలో కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాలు కేటాయించడాన్ని ప్రస్తావించారు.ఈ ఎన్నికలలో ఏ పార్టీ కూడా ఇవ్వని విధంగా బీఆర్ఎస్ 10సీట్లు కేటాయించడం,బీసీ శాఖను గతంలో జోగు రామన్న, తర్వాత గంగుల కమలాకర్ లకు ఇచ్చారని పేర్కొన్నారు.గురువారం జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హాజరవుతారని నాగేశ్వరరావు,గాంధీ,వెంకటేశ్వర్లు తెలిపారు.దీనికి ఖమ్మం నియోజకవర్గ వాసులైన మున్నూరుకాపు అన్నాదమ్ముళ్లు,అక్కాచెల్లెళ్లు పెద్ద సంఖ్యలో హాజరు కావలసిందిగా వారు కోరారు.ఈ సన్నాహాక సమావేశంలో కార్పోరేటర్స్ తోట వీరభద్రం,మాటేటి నాగేశ్వరరావు,మడూరి ప్రసాద్, సర్పంచులు గొర్రె శ్రీనివాస్ (చిమ్మపుడి), హరిప్రసాద్ (కోయచెలక),ఉద్యమకారులు గుండ్లపల్లి శేషగిరిరావు, పగడాల నరేందర్,విద్యా సంస్థల అధినేత శెట్టి భాస్కరరావు,ఖమ్మం నగర తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షులు కుమ్మరికుంట్ల వెంకట నారాయణ,యువజన నాయకులు రాపర్తి రాజా,గోలెపు గణేష్,నానబాల హరీష్, సంఘం ప్రముఖులు కే.ఉప్పలయ్య,ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




