మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ విజేత నరేష్ కు ఘనంగా సత్కారం
Mr. India Bodybuilding winner Naresh felicitated
తిరుపతి, మార్చి 4:
సీనియర్ మిస్టర్ ఇండియా బాడీ బిల్ డింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ అందుకున్న తిరుపతికి చెందిన టి నరేష్ ను తిరుపతి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ అండ్ మోడలింగ్ అసోసియేషన్ బుధవారం ఘనంగా సత్కరించింది.ఫిబ్రవరి 25, 26,27వ తేదీలలో ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నగరంలో సీనియర్ మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరు క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో ఎంపికైన తిరుపతికి చెందిన టి నరేష్ 65 కేజీలు విభాగంలో పాల్గొని మూడవ స్థానాన్ని కైవసం కైవసం చేసుకుని బ్రాంజ్ మెడల్ అందుకున్నారు. అలాగే క్లాసిక్ బాడీ విభాగం పోటీలలో మూడో స్థానం, మెన్ ఫిజిక్ లో నాలుగవ స్థానం కైవసం చేసుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా బుధవారం తిరుపతి జిల్లా బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ అండ్ మోడలింగ్ అసోసియేషన్ చైర్మన్, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ బుధవారం తన నివాసంలో నరేష్ ను దుశ్యాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఎక్కడ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించిన విజేతగా నిలిచి తిరుపతి గౌరవాన్ని పెంచే విధంగా నరేష్ కు తగిన సహాయ సహకారాలు అందజేస్తానని గిరిధర్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ అండ్ మోడలింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ శివప్రసాద్ రాయల్, కోశాధికారి ఏ చేతన్ రాయల్, రెఫరీ ఏ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు.



