- Advertisement -
చల్లా ప్రభాకరరావు ను పరామర్శించిన ముద్రగడ పద్మనాభం
Mudragada Padmanabham visited Challa Prabhakara Rao
ఆలమూరు
మాతృ వియోగంతో బాధపడుతున్న కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రముఖుడు ఆలమూరు గ్రామానికి చెందిన చల్లా ప్రభాకరరావు ను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం పరామర్శించారు. చల్లా ప్రభాకరరావు మాతృమూర్తి శ్రీమతి చల్లా మునీశ్వరమ్మ డిసెంబర్ 26న స్వర్గస్తులయ్యారు. ఆమె ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా సుదీర్ఘకాలం పని చేసారు.సోషల్ వర్కర్. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ప్రభాకరరావు కుటుంబంతో గత మూడు తరాలుగా తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నారనీ, తమ బంధువుల నీ ఆయన అన్నారు. ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు,ఐక్యకాపునాడు ఉపాధ్యక్షులు,సీనియర్ న్యాయవాది జొన్న పల్లి సత్యనారాయణ, చల్లా సత్యనారాయణ( నానాజీ) చల్లా భూషణం ( బుజ్జి), కొత్తపేట న్యాయవాది, ప్రముఖ వ్యాపారవేత్త కొప్పుల వీర వెంకట సత్యనారాయణ (సూరిబాబు), శ్రీపతి వీర్రాజు,పురుషొత్తం వీర్రాజు,లంకే వెంకటరెడ్డి, ఆలమూరు మాజీ జడ్ పిటిటిసి ఆర్ శేషగిరిరావు, మాజీ ఉప సర్పంచ్ చల్లా సత్యనారాయణ, చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -