లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు
సుల్తానాబాద్ పెద్దపెల్లి జిల్లా
జూన్-28 వాయిస్ టుడే:
Municipal officials caught by ACB while taking bribe
సుల్తానాబాద్ పట్టణానికి చెందిన అర్నకొండ ప్రసాద్ ఇంటి నెంబర్ కోసం గత సంవత్సర కాలం నుండి సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోగా గత పది రోజుల నుండి మున్సిపల్ ఉద్యోగులైన ఆర్ ఐ వినోద్, ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ నాంపల్లి విజయ్ లను సంప్రదించగా పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ముందుగా ఐదు వేల రూపాయలు ఇస్తుండగా అవినీతి నిరోధ శాఖ అధికారులు వారిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సిఐ తిరుపతి, కృష్ణ కుమార్, పున్నమ్ చంద్ లు
ఏసీబీ సిబ్బంది తదితరులు ఉన్నారు…


