Tuesday, January 14, 2025

ముందే ముంగిట్లోకి ముంజులు, మామిడిపండ్లు

- Advertisement -

ముందే ముంగిట్లోకి ముంజులు, మామిడిపండ్లు

Munjulu and mangoes are pre-sliced

విజయవాడ, జనవరి 7, (వాయిస్ టుడే)
ఏపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.ఎప్పుడో వేసవి కాలం అంటే ఏప్రిల్‌ , మే నెలలో కనిపించే తాటి ముంజలు, మామిడి పండ్లు.. మూడు నెలలు ముందుగానే దర్శనమిచ్చాయి.  విచిత్రంగా డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు అందుబాటులోకి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. . ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు వీటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు.వాస్తవానికి ఏటా వేసవికాలంలో, ఏప్రిల్‌ నెలలో తాటిముంజలు సీజన్ ఉంటుంది. జనాలు ఎండ తీవ్రతను నుంచి ఉపశమనం పొందేందుకు కొంటుంటారు. కానీ ఇప్పుడు రోడ్ల పక్కన డిసెంబర్‌లోనే తాటి ముంజలు కనిపిస్తున్నాయి. విజయవాడలోని బందరు రోడ్డులో గంగూరు సమీపంలో తాటిముంజలను డజను రూ.100 నుంచి రూ.120కి విక్రయిస్తున్నారు. జనాలు కూడా తాటి ముంజల్ని కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది మాత్రం డిసెంబర్‌లో తాటి ముంజలు ఏంటని చర్చించుకుంటున్నారు.మరోవైపు విజయవాడలోనే మామడి పండ్లు కూడా రోడ్ల పక్కన కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో తోటల్లోని రెండు వేల చెట్లలో మామిడి పంట దిగుబడికి వచ్చిందట. మొత్తం నాలుగు టన్నుల మామిడి పండ్లను విజయవాడ కృష్ణలంక సమీపంలో రోడ్డుపై వీటిని అమ్ముతున్నారు. వీటిని కిలో రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. జనాలు కూడా మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే  తాటి ముంజలు, మామిడి పండ్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తే.. అవి పైరు కాపు ఉత్పత్తులని.. వందల చెట్లలో కొన్ని ఇలా ముందే కాపునకు వస్తాయని రైతులు చెబుతున్నారు.అందుకే ముందే ఇలా పంట దిగుబడి వచ్చిందంటున్నారు.వాస్తవానికి మామడి పండ్లు, తాటి ముంజలు ఏప్రిల్ నెలలో అమ్మకాలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువగా పంట దిగుబడి ఉంటుంది. మామిడి పండ్లు ఆగస్టు నెల వరకు దొరకుతాయి.. ఆ తర్వాత పునాస మామిడిపండ్లు ఉండేవి. కానీ విచిత్రంగా తాటి ముంజలు మాత్రం డిసెంబర్‌లో రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్