ఘనంగా మున్నూరు కాపు పటేల్ సంఘం జిల్లా సమావేశం

- Advertisement -

ఘనంగా మున్నూరు కాపు పటేల్ సంఘం జిల్లా సమావేశం
వాయిస్ టుడే : రాజన్న సిరిసిల్ల

Munnur Kapu Patel Sangam District Meeting held in grand style

Munnur Kapu Patel Sangam District Meeting held in grand style
Munnur Kapu Patel Sangam District Meeting held in grand style

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా, మండల కమిటీ సభ్యులు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొంచెట్టి శంకర్ పటేల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమురయ్య పటేల్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ —

“కుల గణనలో మన సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. మన అసలు జనాభా లెక్కలు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించబడుతుంది. జిల్లా, మండల, గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ప్రతి కుటుంబం సభ్యత్వం నమోదు చేసుకోవాలి,” అని పిలుపునిచ్చారు.

సభ్యత్వ నమోదు పూర్తైన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్నూరు కాపు పటేల్ గర్జన సభను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలో సుమారు పది వేల మంది మున్నూరు కాపులు పాల్గొననున్నారు. రాజకీయాలకు అతీతంగా మూడు ప్రధాన పార్టీల ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని, వారికి ఘనంగా సన్మానం చేయాలని తీర్మానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మున్నూరు కార్పొరేషన్ ఫండ్స్, మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు వంటి హక్కులను సాధించాలంటే ఉమ్మడి జిల్లాల వారీగా గర్జన సభలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా BC సంఘాల ఆధ్వర్యంలో BC JAC (Joint Action Committee) ఏర్పాటు చేయగా, ఆర్. కృష్ణయ్య ని చెర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వారి ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించబోయే BC బంద్ – “Bandhu Justice” పిలుపును విజయవంతం చేయాలని కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు.

జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య పటేల్ మాట్లాడుతూ:

“మున్నూరు కాపు యువత ప్రతీ పరిస్థితిలో సమాజానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.”అని అన్నారు .

సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధ్యక్షులు మరియు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular