Wednesday, January 14, 2026

ఖండాలు దాటిన మున్నూరు ఖ్యాతి

- Advertisement -

ఖండాలు దాటిన మున్నూరు ఖ్యాతి
వాయిస్ టుడే : హైదరాబాద్

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

ఏడు ఖండాలలో ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుక రావడానికి కోసం ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యం మహాసభ కన్వీనర్ సంగని రజనీకాంత్ అద్వర్యం లో ఆగస్టు 30 నుంచి 31 తేదీ లో అమెరికా, వర్జీనియాలోని లీస్ బర్గ్ ఉత్సాహంగా జరిగాయి.

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

అతిధులు మాట్లాడుతూ అమెరికాకు వచ్చే,వచ్చిన యువతకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరిస్తూ కొండంత అండగా నిలుస్తున్న గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్,ఇమ్మిగ్రేషన్,వీసా విషయాలలో,చిరు వ్యాపారులు,పేద విద్యార్థులకు ఇక్కడ స్థిరపడిన మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఇక్కడి ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగాలు రాక, కోల్పోయిన వారికి ఆశ్రయం కల్పించేందుకు వాషింగ్టన్,చికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ,లాస్ ఏంజిల్స్ వంటి నగరాల శివార్లలో భూములు కొని భవనాలు కట్టాల్సిందిగా ఎంపీ వద్దిరాజు సూచించారు.

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్,వెంకట్,వారి మిత్ర బృందాన్ని అతిధులు అభినందించారు.అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన మీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, మున్నూరు కాపుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని వక్తలు అన్నారు. బతుకమ్మ,దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగిందని, రుచికరమైన మన తెలంగాణ వంటకాలతో కడుపునిండా భోజనం చేశామన్నారు. ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు.

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

ఈ సందర్భంగా మహాసభ నిర్వాహకులు అతిధులను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను ప్రదానం చేశారు.అంతర్జాతీయ షూటింగ్ పోటీలలో ప్రతిభాపాటవాలు చాటుతూ సిల్వల్ మెడల్స్ గెల్చుకున్న పోలీస్ అధికారి సాధుల సారంగపాణి కూతురు మేఘన ను ఎంపీ రవిచంద్ర శాలువాతో సత్కరించి, జ్ఞాపికను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు నిర్వహించిన మ్యాజిక్ షో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది , మిమిక్రీ ఆర్టిస్ట్ రేగుల మహేష్ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ జానపద గాయనీ రేలారే గంగ జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్ హిట్ సినీ పాటలతో మాళవిక అలరించారు.చివరిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ నైట్ అందరిని ఉత్తేజ పరిచింది .

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

ఈ మహాసభ సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, యువత క్రూజ్ మ్యాట్రిమోనియల్ ట్రిప్ , బ్యూటీ పేజెంట్ , రంగురంగుల ముగ్గుల పోటీలు అందరిని ఆకర్షించాయి,ఈ కార్యక్రం లో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాయచూరు మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్,మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండా

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

దేవయ్య ,మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ ,సుంకర బాలకిషన్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,ప్రముఖ యూట్యూబర్ గంగవ్వ, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు,మూగ జయశ్రీ,చల్లా స్వరూపరాణి, మిరియాల రాఘవరావు, డాక్టర్ శివప్రసాద్,రాజలింగోళ్ల శృంగాద్రి కుమార్, తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు ఈ మహాసభలో ఇండియాలోని పలు రాష్ట్రాలు,అమెరికా,కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,ఖతర్ తదితర దేశాలలో నివసిస్తున్న వందలాది పాల్గొన్నారు.

Munnur's fame crosses continents
Munnur’s fame crosses continents

ఈ కార్యక్రమాన్ని GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్, డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల, కృష్ణశ్రీ గంధం, అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ వాలంటీర్లు కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేసారని కన్వీనర్ రజినీకాంత్ తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్