

ఏప్రిల్ 2(వాయిస్ టుడే జిల్లా ప్రతినిధి ఏనుగుల వీరాంజనేయులు.) ఎవరో వస్తారు! ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, సమాజం నాకేమిచ్చింది అనుకోకుండా, సమాజానికి నేనేం చేశానని స్ఫూర్తితో తనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేస్తూ, దాతృత్వాన్ని, చా టుకొని శభాష్ అనిపించుకుంటున్నారు మహిళా దాత. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన విద్యాసంస్థల చైర్మన్ రామ్ శెట్టి విజయ శ్రీ ,అలియాస్ చాపల విజయ శ్రీ, ఎంతో మందికి విద్యా సంస్థల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించి తమ కాళ్ళ పై తాము నిలబడే విధంగా కృషిచేసిన విద్యావేత్త విజయశ్రీ , అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా శ్రీశైలం మున్నూరు కాపు అన్నదాన సత్రంలో, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లో మున్నూరు కాపు అన్నదాన సత్రంలో గదులు నిర్మించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అందరూ నా వాళ్ళే అనుకొని, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ భరోసానిస్తూ త నకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ, దాతృత్వాన్ని ప్రదర్శిస్తూ జనజీవన స్రవంతిలో ప్రజలు, ప్రజాప్రతితుల నుండి ఆమె మన్ననలు పొందారు. సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆమె అభిరుచి. అవినీతిని సహించని ఆమె. ప్రస్తుతం, మట్టపల్లి శ్రీకృష్ణదేవరాయ మున్నూరు కాపు అన్నదాన సత్రం డైరెక్టర్ గా, శ్రీశైలం అన్నదాన సత్రం డైరెక్టర్ గా కొనసాగుతూ, కమిటీల అవసరాల మేరకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ అన్నదాన సత్రాలకు చేయూతనందిస్తూ, నిరంతరము స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు మిర్యాలగూడ విజయశ్రీ. సత్రాలకు చేయూతనిందిస్తున్న విజయ శ్రీ నీ,కమిటీ సభ్యులు, గౌరవ సలహాదారులు, మున్నూరు కాపు, దేవస్థాన పెద్దలు సన్మానాలు చేశారు. విజయ శ్రీ రాబోయే రోజుల్లో అన్నదాన సత్రాలకు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటారని సలహాదారులు ,డైరెక్టర్లు ,పాలకవర్గ సభ్యులు కోరుకుంటున్నారు.