కొత్తగూడెం అసెంబ్లీ సీటు ఎడవల్లి కి కేటాయించకపోతే కాంగ్రెస్కు దూరం అంటున్నా సామజిక వర్గం
రాష్ట్రంలో సుమారు 50 లక్షల కలిగి ఉన్న సామాజిక వర్గం
సోమవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు రహస్య సమావేశాలు

భద్రాచలం, అక్టోబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజవర్గంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ పొత్తుల్లో భాగంగా సిపిఐ పార్టీకి అసెంబ్లీ సీటు కేటాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సాయశక్తుల కృషి చేస్తున్న ఎడవల్లి కృష్ణకి టిక్కెటు ఇవ్వకుండా పొత్తుల్లో భాగంగా సిపిఐ పార్టీ కి ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు అగ్రవేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముఖ్యంగా మున్నూరు కాపులు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలు పైనే ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోతున్న, పార్టీ అధికారంలోకి రావాలని ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము ప్రజలకు వివరిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ పార్టీ కోసం కృషి చేస్తున్న ఎడవల్లి కృష్ణని కాదని, సిపిఐ పార్టీకి కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు కేటాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పట్ల మున్నూరు కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడవల్లి కృష్ణ కు ఎమ్మెల్యే సీటు కేటాయించకపోతే కాంగ్రెస్కు దూరం ఉంటున్న మున్నూరు కాపు పెద్దలు…..
వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సీటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడవల్లి కృష్ణ కి కేటాయించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులందరూ కాంగ్రెస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తూ ,పార్టీ దైవం అంటూ తన వ్యాపారాలను సైతం పక్కనపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దూరం పెడితే మేము కూడా కాంగ్రెస్ పార్టీని దూరంగా పెడతామని మున్నూరు కాపులు స్పష్టం చేస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి మున్నూరు కాపుల రహస్య సమావేశాలు….
కొత్తగూడెం ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ పార్టీ ఎడవల్లి కృష్ణ కి కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి అని తీర్మానిస్తున్నట్లు తెలుస్తుంది. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందుకు తగ్గ వ్యూహ రచనలు చేస్తున్నట్లు తెలిసింది.



