మున్నూరు కాపు ల కల నెరవేరింది
మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొనగంటి
మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు
జమ్మికుంట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మున్నూరు కాపు రాష్ట్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపుల కల నెరవేరిందని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు. బుధవారం స్థానిక మోత్కులగూడెం చౌరస్తాలో మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ బూసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం పొన్నగంటి మల్లయ్య, సింగిల్ విండో అధ్యక్షులు పొన్నగంటి సంపత్, మున్నూరు కాపు జిల్లా నాయకులు ఆకుల రాజేందర్ లు మాట్లాడారు. గత 20 సంవత్సరాల నుండి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు పోరాటాలు, ఆందోళనలు, పాదయాత్రలు, వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ ఆ కళ నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, పోరాటం చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యకు, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ కు, సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనుగంటి విజయలక్ష్మి, పొన్నగంటి సారంగం నాయకులు పొనగంటి రవి కుమార్, ఆకుల నారాయణ, పొనగంటి శ్రీధర్, సతీష్, ఏ బూసి ఓదెలు, రంజిత్, సంపత్, విష్ణు, మేడిపల్లి మొగిలి తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు ల కల నెరవేరింది
- Advertisement -
- Advertisement -



