రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్య కేసు: సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్

- Advertisement -

రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్య కేసు:
సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్

Murder Case of Tanuja, Wife of Retired DG:
CP Sajjanar Reveals Sensational Details

హైదరాబాద్
జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్య గావింపబడిందని తమకు మొదటగా సమాచారం వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ డీజీ భార్య తనూజను గురువారం రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారని చెప్పుకొచ్చారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని అన్నారు. కొన్ని క్లూస్ లభించాయని..ఆ క్లూస్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేపాలి పనివాళ్లపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పనిమనిషి కల్పన ఈ హత్య చేసింది
నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. గురువారం రాత్రి రిటైర్డ్ డీజీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పనిమనిషి కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసిందని తెలిపారు. నిందితులు వెనుకాల గేటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో పిల్లలు ఇద్దరు పై ఫ్లోర్‌లో ఉన్నారని..తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారని వెల్లడించారు.ఇంట్లో ఉన్న పనిమనిషి కల్పనాతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని..నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
వాళ్లపై నిఘా ఉంచాలి:
నేపాలి పనిమనుషులు ఇంట్లో ఏడాది, రెండో ఏడాది పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పారు. రిటైర్డ్ డీజీ తల్లి కోసం తనూజ హైదరాబాద్ వచ్చారని తెలిపారు. ఇటీవల రిటైర్డ్ డీజీ తల్లి మరణించారని..అప్పటి నుంచి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటున్నారని వివరించారు. ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular