ఫుల్ లెంగ్త్ కామెడీతో “ముసలోడికి దసరా పండుగ” మూవీ
“Musalodiki Dasara Panduga” — A Movie Packed with Full-Length Comedy
నాన్‌స్టాప్ నవ్వులు పండించడానికి టాలీవుడ్ తెరపైకి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాబోతోంది. రాజీ నాయుడు – సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణా ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రమణ వాళ్లె నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం “ముసలోడికి దసరా పండుగ” విలక్షణ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 15న) థియేటర్‌లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత రమణ వాళ్లె మాట్లాడుతూ.. “ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే రెండు గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. సినిమా అవుట్‌పుట్ పట్ల మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలం. ఈ సినిమాను మా పితృ సమానులు దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నాం” అని తెలిపారు.
చాలా కాలం తర్వాత తెలుగు తెరపైకి ఫ్యామిలీ ఎమోషన్స్, ఫుల్ లెంగ్త్ కామెడీతో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తారాగణం & సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో నాజర్‌తో పాటు అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేం), అనిత (నువ్వు నేను ఫేం), కోవై సరళ, శరణ్య, సత్య వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.



