Sunday, September 8, 2024

ఆర్టీసీ బిల్లును ఆపడం నా ఉద్దేశం కాదు

- Advertisement -

గవర్నర్ తమిళిసై

My intention is not to stop the RTC bill
My intention is not to stop the RTC bill

హైదరాబాద్, వాయిస్ టుడే: ప్రభుత్వంలో టీఎస్‌ఆర్టీసీ బిల్లు వ్యవహారం రాష్ట్రంలో కాక రేపింది.. ఓవైపు గవర్నర్‌పై అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు.. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గంటల పాటు డిపోలకే పరిమితం అయ్యాయి బస్సులు.. ఇక, రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు కార్మికులు.. అందులో కొంతమంది నేతలను లోపలికి పిలిచి చర్చలు జరిపారు గవర్నర్‌ తమిళిసై.. కార్మిక సంఘాల నేతలు, గవర్నర్‌ మధ్య సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది.. ఆ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. చర్చల సారాశాంన్ని వివరించారు. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని తెలిపారు ఆర్టీసీ యూనిన్‌ లీడర్‌ థామస్ రెడ్డి.. సుదీర్ఘంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించాం.. సమ్మె కాలంలో కూడా నేను మీకు సహకరించాను అని గుర్తుచేశారని తెలిపారు. ఇక, కార్మికుల మేలు కోసమే విలీనం విషయంలో ప్రభుత్వానికి ప్రశ్నలు రాశాను అని చెప్పారు.. ప్రభుత్వం కూడా సమాధానాలు రాసి పంపినట్లు తెలిసింది.. కానీ.. మా ఆఫీస్ కి ఇంకా అందలేదు అని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. ఆర్టీసీ బిల్లును ఆపడం నా ఉద్దేశం కాదు..

My intention is not to stop the RTC bill
My intention is not to stop the RTC bill

ప్రభుత్వానికి కొన్ని డౌట్స్ ఉన్నాయని రాసి క్లారిఫికేషన్ కోసం అడిగాను.. అసెంబ్లీ సెషన్ ముగిసే లోపు కచ్చితంగా ఆమోదించేoదుకు ప్రయత్నిస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. సత్వర పరిష్కారం చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ తెలిపారన్న ఆయన.. నేరుగా ఆమె ఏమైనా సవరణలు ఉంటే రాసి పంపడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసమే.. నేను కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను అని గవర్నర్ అన్నారని చెప్పుకొచ్చారు. గవర్నర్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత గవర్నర్ ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా థామస్‌ రెడ్డి వెల్లడించారు. మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లే పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు?, అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరిన విషయం విదితమే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్