
తిరుపతి జిల్లా..: తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్వవిద్యాలయంలో జరిగిన ఉమెన్ ఎంపవరింగ్ అనే సెమినార్ లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా … ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ… మహిళలు సాధికారత సాధించాలంటే ఆర్థిక స్వావలంబన ఉండాలనీ ఉపాధి,ఉద్యోగం,రాజకీయం ఇలా అన్ని అంశాల్లో మహిళలకు అవకాశం కల్పించటం ద్వారా మహిళలు సాధికారిత సాధించవచ్చనీ దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే మహిళలకు అన్ని అంశాల్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారనీ పాలు ఇచ్చే చేతులే నేడు పాలించే స్థాయి కి చేరారనీ ప్రధాని, రాష్ట్రపతి స్థాయికి మహిళలు ఎదిగారనీ మహిళలు ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతుయని కుటుంబ సభ్యుల సహకారం తో తాను రాజకీయాల్లో రాణిస్తున్నాననీ గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగుదలకు జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనీ సినిమా వాళ్లకు క్యారెక్టర్ ఉండదు బ్లూ ఫిల్మ్ లు చేస్తారని ఒకడు అన్నాడనీ, మా అమ్మ 32 ఏళ్ల క్రితం ఇలాంటి మాటలు వస్తాయని చెప్పిందని అది ఇప్పుడు జరుగుతోందనీ అయినా తాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నా,మహిళలకు సున్నిత మనస్సు ఉంటుందనీ మంత్రి రోజా తెలియచేశారు…
