నాగార్జున సాగర్ కు  కొనసాగుతున్న  వరద ఉధృతి

- Advertisement -

నాగార్జున సాగర్ కు  కొనసాగుతున్న  వరద ఉధృతి

Nagarjuna Sagar continues to face flooding

     ప్రాజెక్టు 24 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు
నాగార్జున సాగర్ సెప్టెంబర్ 9
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. భారీగా వరద కొనసాగుతుండటంతో అధికారులు.. ప్రాజెక్టు 24 గేట్లు ఓపెన్ చేశారు. ఇందులో 20 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలోకి ఇన్ ఫ్లో 2,59,730 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,59,730 క్యూసెక్కులుగా ఉంది.కాగా.. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ జలశయానికి భారీ వరద వచ్చి చేరుతుంది. ఇక, శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular