సైబర్ నేరగాళ్ల ఉచ్చులో నకిరేకల్ ఎమ్మెల్యే
హైదరాబాద్, మార్చి 5
Nakirekal MLA in the trap of cyber criminals
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేశారు. ఆయన సోసల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ నుంచి ఫొటోలు సేకరించిన కేటుగాళ్లు.. వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్ కాల్స్ చేసినట్టు వీడియో తయారు చేశారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే వీరేశంకు పంపి, డబ్బులు డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.వివరాల్లోకి వెళ్తే.. నకిరేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. దీంతో ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో.. అవతలి వ్యక్తి నగ్నంగా కాల్ మాట్లాడారు. ఇంతలో కేటుగాళ్లు స్క్రీన్ రికార్డు చేసి మళ్లీ ఆయనకే పంపారు.. వీడియో విషయంపై బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన స్పందించక పోవడంతో ఆ వీడియోను సదరు కాంగ్రెస్ నేతలకు పంపారు.ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వీరేశంకు ఫోన్ చేయడంతో ఖంగుతిన్నారు. దీంతో నేరగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఇదిలా ఉంటే.. సైబర్ క్రైమ్.. ఈ పేరు వింటేనే వణుకుపుడుతోంది. పెరుగిపోతున్న సాంకేతికతను మోసగాళ్లు ఆసరాగా తీసుకుని అందిన కాడకి డబ్బులు దండుకుంటున్నారు. సులభంగా మనీ సంపాదించడంపై ఫోకస్ చేయడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. గతంలో చోరీలు అంటే ఇంటి కిటికీలు, తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న డబ్బును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని కూడా కన్నాల వేయవచ్చని నిరూపిస్తున్నారు.సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల అమాయకులనే కాదు ప్రజా ప్రతినిధులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేపై అశ్లీల వీడియో కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఎటాక్ చేశారు.నల్లగొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సెల్‌ఫోన్‌లోకి చొరబడి సైబర్ ఎటాక్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్‌లో నుండి ఫోటోలను సేకరించిన సైబర్ క్రిమినల్స్.. స్క్రీన్ రికార్డు పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి పంపి ఎమ్మెల్యేను బెదిరించారు. చివరికి తనపై జరుగుతున్న సైబర్ ఎటాక్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తన అనుచరులతో మాట్లాడుతున్న సమయంలోనే సైబర్ నేరగాళ్ల నుంచి వీడియో కాల్ వచ్చింది. ఒక్కసారిగా నగ్నంగా ఉన్న వ్యక్తి వీడియో కాల్‌లోకి రావడంతో కాల్ కట్ చేశారు వీరేశం. వీడియో కాల్ సైబర్ మోసగాళ్లు చేస్తున్నారని వెంటనే పసిగట్టిన వీరేశం.. వెంటనే కాల్ కట్ చేశారు. అంతటితో వదలని కేటుగాళ్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యేను బెదిరించారు సైబర్ నేరగాళ్లు. వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేదంటే డబ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిల్ చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వీరేశం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సలహాతో సైబర్ నేరగాళ్ల నెంబర్ ను ఎమ్మెల్యే వీరేశం బ్లాక్ చేశారు.గత ఏడాది అక్టోబర్ లో సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యే వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు వాట్సాప్ మెసేజ్‌లు చేశారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలను కోరారు. సైబర్ నేరాలు పట్ల అవగాహన కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సెల్ ఫోన్ రింగ్ టోన్ ను పెట్టారని ఆయన చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫైబర్ నేరగాళ్ల విషయంలో ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేముల వీరేశం సూచించారు. అయితే కన్నం మీ ఇంటికి కాదు.. మీకు, మీ బ్యాంకు ఖాతాకు.గతంలో ఈ మోసాలా భారినపడిన వారిలో యువకులు, మహిళలు ఉంటే.. ఇప్పుడు రాజకీయ నాయకులు, వృద్ధులు కూడా ఈ కోవకే వచ్చేశారు. అసలు సైబర్ మోసం లేని రోజు లేదు అన్నట్లు కాలం మారిపోయింది. మరి ఇందుకు గల కారణాలు ఏంటి..? మోసపోకుండా ఉండాలంటే ప్రజలు ఏవిధంగా అవగాహన చెందాలి. కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటమే అర్హత. నాలుగు ముక్కలు మాట్లాడి బురిడీ కొట్టించగలిగితే అదే ఆయుధం. ఇదీ సైబర్ నేరస్థులు అనుసరిస్తున్న పంథా.. మొన్నటి వరకు వివధ దేశాలు నగరాలకే పరిమితమైన కేటుగాళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, పల్లెలు, తండాలకు కూడా విస్తరించారు. ఏమరుపాటుగా ఉన్నారో సర్వ నాశనమే. ఏదైనా గుర్తు తెలియని నెంబర్‌తో మెసేజ్ కానీ, ఫోన్ కానీ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. డేంజర్‌లో పడ్డట్టే.. మీ ముబైల్‌లో డేటా మొత్తం వాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఇక న్యూడ్ వీడియోలు, మెసేజ్‌లతో డబ్బులు కోసం బెదిరించే ఛాన్స్ ఉంది. ఇలాంటివి ఏమైనా వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.