Sunday, September 8, 2024

నారీశక్తి వందన్ బిల్లుగా నామకరణం

- Advertisement -

చరిత్రలో నిలిచిపోయే రోజు.. ఈరోజు

2029లో అమలులోకి మహిళా బిల్లు

Named as Narishakti Vandan Bill
Named as Narishakti Vandan Bill

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19:  ఆటల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉందని, నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చిందన్నారు. మహిళా రిజర్వేషన్లపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని సూచించారు. మహిళా రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీని కోసం ముందడుగు వేయబోతున్నామని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించారని ప్రధాని మోడీ అన్నారు. ఈరోజు చరిత్రలో మిగిలిపోతుందని తెలిపారు. మహిళా సాధికారితపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. మహిళా బిల్లుకు “నారీశక్తి వందన్” బిల్లుగా నామకరణం చేశారు. నారీ శక్తి వందన్ తో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అన్నారు.అంతకుముందు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ్యులందరినీ ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఆధునికతకు అద్దం పట్టేలా, చరిత్రను ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనం ప్రతీకగా నిలుస్తుందని, వినాయక చతుర్థి రోజున పార్లమెంట్ భవనంలోకి వచ్చామని, సభ్యులందర్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మన లక్ష్యమని ఆయన అన్నారు. చరిత్రను ప్రతిబింబిచేలా కొత్త పార్లమెంట్ ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అజాదీకా అమృత్ కాలంలో ఇది ఉషోదయ కాలం అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పనిచేయాలని సూచించారు. నెహ్రూ చేతికి శోభనిచ్చిన సెంగోల్ కొత్త పార్లమెంట్ లో ఉందని ఆయన అన్నారు.

దాదాపుగా మూడు దశాబ్ధాల కల, మోదీ ప్రభుత్వం నెరవేర్చబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. మహిళా బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’గా పేరు పెట్టారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం కోటా రిజర్వేషన్ గా ఇవ్వనున్నారు. అయితే ఈ బిల్లు 2029లో మాత్రమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మాత్రమే కోటా అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.జనాభా లెక్కలకు అనుగుళణంగా 2027లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. బిల్లు చట్టంగా మారిన తర్వా త 15 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది, దీని తర్వాత కాలవ్యవధిని పొడించవచ్చు. ఆరు పేజీల బిల్లులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ ఉంది. ఓబీసీలకు మాత్రం ఈ అవకాశం లేదని తెలుస్తోంది. రాజ్యసభ, రాష్ట్రమండలిలో ఈ రిజర్వేషన్ ఉండదు.

Named as Narishakti Vandan Bill
Named as Narishakti Vandan Bill

బిల్లులోని కీలక అంశాలివే..

  • ఈ బిల్లు ద్వారా పార్లమెంట్, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడుతాయి.
  • ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది.
  • ఒక స్థానం నుంచి ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ చేసేందుకు అనుమతించరు.
  • బిల్లులో ఓబీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ బిల్లు రిజర్వేషన్ ఉండదు
  • డీ లిమిటేషన్ తర్వాతనే బిల్లు అమలులోకి వస్తుంది. 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది.
  • డీలిమిటేషన్ కసరత్తు తర్వాత లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు కేటాయించబడిన సీట్ల రొటేషన్ జరుగుతుంది.
  • భారతదేశంలో పార్లమెంటు మరియు శాసనసభలలో మహిళలు 14 శాతం మాత్రమే ఉన్నారు, ఇది ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ.

బిల్లు క్రెడిట్ మాదే ‌ సోనియా

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురాబోతోంది. సోమవారం మోడీ అధ్యక్షతన మంత్రి మండలి ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. అయితే బిల్లును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పింది.అయితే ఈ బిల్లు తమదే అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ దీని కోసం గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మంగళవారం పార్లమెంట్ సమావేశాలకు వచ్చిన సమయంలో మీడియా అడిన ప్రశ్నకు సోనియాగాంధీ మహిళా బిల్లు తమదే అని సమాధానం ఇచ్చారు. అంతకుమందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్(ట్విట్టర్)లో బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నట్లు, బిల్లులోని వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు.. అఖిలపక్షం సమావేశంలో దీని గురించి చర్చించి ఉండవచ్చు. గోప్యంగా పనిచేయడానికి బదాులుగా ఏకాభిప్రాయం ద్వారా బిల్లును తీసుకురావచ్చు’’ అని ఆయన ట్వీట్ చేశారు.ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే అది యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్, మిత్ర పక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉన్నప్పుడు బిల్లును 10 ఏళ్లు ఎందుకు తీసుకురాలేదని, 2024 ఎన్నికల కోసమే అనే అనుమానాన్ని మరో సీనియర్ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. యూపీఏ ప్రభుత్వం 2010 మార్చి 9న రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రాజ్యసభ దీనికి ఆమోదం తెలిపింది. అయితే లోక‌సభలో బిల్లు చర్చకు రాలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్