టెక్నాలజీ ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా 48 గంటల్లో దొంగను పట్టుకున్న నందిగామ పోలీసులు
Nandigama police nabbed thief in 48 hours on basis fingerprints using technology
నందిగామ
ఈనెల 30వ తారీకు రుద్రవరం గ్రామంలో పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి బంగారం డబ్బు దోచుకెళ్లిన దొంగ
దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సిఐవైవి ఎల్ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకొని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు
ఏసిపి ఏబీజీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 30వ తారీకు రుద్రవరం గ్రామంలో దొంగతనం జరిగిందని 30-11-24 వ తేదిన మద్యహ్నం సుమారు 12.30 గంటల సమయంలో నందిగామ రుద్రవరం గ్రామానికి చెందిన పసుపులేటి లక్ష్మి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందితను ఇంటిలో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తాళం పగుల కొట్టి ఇంటిలో లోకి ప్రవేశించి , ఇనుప బీరువా ను పగుల కొట్టి దానిలో లాకర్ లో ఉన్న కొంత డబ్బులను, బంగారపు వస్తువులను తీసుకోని వెళ్లాడు అని ఫిర్యాదు మేరకు సీఐ వైవి ఎల్ నాయుడు ఎస్సై అభిమన్యుతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి 48 గంటల్లో దొంగను పట్టుకొని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు
సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి వేలిముద్రల ఆధారంగా దొంగను పట్టుకున్నామని ఇతను గతంలో కూడా కొన్ని దొంగతనాలు చేశాడని ఏసిపి తెలిపారు
దొంగతనం చేసిన వ్యక్తి చింతల గోపాల రావు, తండ్రి లేటు కృష్ణ, వయసు 30 సంవత్సరములు, కులము వడ్డెర, పోలంపల్లి గ్రామం, వత్సవాయి మండలం, NTR జిల్లా. ప్రస్తుతము:- కోదాడ టౌన్, తెలంగాణా రాష్ట్రం నివసిస్తున్నాడు ముద్దాయి వద్ద నుండి
ఒక బంగారపు నానుత్రాడు షుమారు 16 గ్రాములు ఒక చిన్న ఉంగరము షుమారు 2 గ్రాములు,38,500/- నగదును సిజ్ చేయడం చేసామని ఏసిపి తెలిపారు