దుమ్ము రేపుతున్న హిట్ 3
హైదరాబాద్, ఏప్రిల్ 14
Nani's hit 3 is causing a stir
నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘హిట్ 3’ . ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫ్యాన్స్ సందడి మధ్య విశాఖ సంగం థియేటర్‌లో జరిగిన ఈవెంట్‌లో ట్రైలర్ లాంఛ్ చేశారు.సినిమాలో నాని మాస్ యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’ పాత్రలో ఆయన మాస్ ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఎప్పుడూ కోపంతో కనిపించే ఆయన లుక్.. క్రిమినల్స్ పట్ల మోస్ట్ వయలెంట్ ఆఫీసర్‌గా ఆయన ప్రవర్తించిన తీరు చూస్తుంటే.. సినిమాలో కొంచెం వయలెన్స్ ఎక్కువగానే జోడించినట్లు అర్థమవుతోంది. ఇప్పటివరకూ డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించిన నాని ఈ సినిమాలో మోస్ట్ వయలెంట్ పోలీస్ ఆఫీసర్‌గా తన నటనతో అదరగొట్టారు.క్రిమినల్స్ ఉంటే భూమ్మీద 10 ఫీట్స్ సెల్‌లో ఉండాలి. లేకుంటే భూమిలో 6 ఫీట్ హోల్‌లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు.’ అంటూ నాని చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా ఆసక్తిని పెంచేసింది. 9 నెలల చిన్నారి ఏడుస్తుండగా.. పాప మెడపై కత్తి పెట్టిన తీరు చూస్తుంటే సినిమాలో వయలెన్స్ వేరే లెవల్ అని అర్థమవుతోంది. ఓ మహిళ తన 9 నెలల పాపను కిడ్నాప్ చేశారంటూ భయంతో పోలీసులకు చెప్పే తీరు చూస్తుంటే ఈ క్రైమ్ స్టోరీ అంతకు మించి అనేలా ఉండబోతోంది అని తెలుస్తోంది.టీవీలో బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం నడుస్తుండగా.. హీరో నాని మాస్ ఎలివేషన్స్ చూపించడం నిజంగా గూస్ బంప్స్ తెప్పించింది. ‘ఆపదలో ఉన్న వాళ్లను రక్షించేందుకు యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణం కాపాడేందుకు ఎన్ని అహో రాత్రుళ్లు కష్టపడతాడో ఆయనకు మాత్రమే తెలుసు.’ అంటూ చాగంటి ప్రసంగం సాగుతుండగా.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాని మాస్ ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఫైనల్‌గా అర్జున్ సర్కార్ వయలెన్స్ మాత్రం వేరే లెవల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అర్జున్ సర్కార్ లాఠీకి ఎంతమంది క్రిమినల్స్ దొరుకుతారో?, వారి పరిస్థితి ఏంటో? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్, హిట్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్, రెండో పార్ట్‌లో అడవి శేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా క్రైమ్ థ్రిల్లర్స్ సీక్వెల్ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ రూపొందింది. నాని సరసన ‘కేజీఎఫ్’ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.హిట్ ఫ్రాంచైజీలో ఒక్కో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆసక్తికరంగా కథను నడిపించారు. ఈ రెండు స్టోరీస్‌లో తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్వెస్టిగేషన్ జరగ్గా.. ‘హిట్ 3’ మాత్రం దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో మర్డర్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
మే 1న రిలీజ్
ఈ సినిమాను నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.