Monday, June 16, 2025

‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్ లుక్ రిలీజ్

- Advertisement -

‘ నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్ లుక్ రిలీజ్
సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు.
నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్‌లో సూర్య కనిపించిన తీరుకు ఇది కంప్లీట్ డిఫరెంట్ గా వుంది. ఈ యూనిక్ అడ్రినలిన్‌తో నిండిన అడ్వంచర్ లో క్యారెక్టర్ కి డిఫరెంట్ షేడ్స్ వున్నాయి.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లతో ముందుకు వస్తారు.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
మురళి జి డీవోపీ కాగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్