Monday, February 23, 2026

కెసిఆర్ ఆరోగ్యం పై స్పందించిన నరేంద్ర మోడీ

- Advertisement -

హైదరాబాద్:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దవాఖానలో చేరిన విషయం తెలిసిందే.గురు వారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది.

వెంటనే ఆయనను సోమా జిగూడ యశోదా హాస్పి టల్‌కు తరలించారు. ప్రస్తు తం కేసీఆర్‌ వైద్యుల పర్య వేక్షణలో ఉన్నారు. ఈ నేప థ్యంలో కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

కేసీఆర్ కి స్వల్ప గాయం.. కవిత ట్వీట్

కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ సుప్రిమో కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు.

కేసీఆర్‌కు స్వల్ప గాయ మైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వర లోనే కోలుకుంటారని వెల్ల డించారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్