Sunday, September 8, 2024

మునుగోడులో నర్సయ్య గౌడ్ ?

- Advertisement -

నల్గోండ, అక్టోబరు 26, (వాయిస్ టుడే): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంగా సాగిన బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఆయన ఇవాళ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేమాదిరిగా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కూడా ప్రకటించారు. తాను కచ్చితంగా మునుగోడు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని, పార్టీ ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో కూడా పోటీ చేయడానికి సిద్ధమని తన సంసిద్ధత ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ మునుగోడులో తన అభ్యర్థి ఎవరో తేల్చుకోవాల్సి వస్తోంది.రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే బీసీ మంత్రం పఠిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ ప్రచారం మొదలుపెట్టింది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరిగిన డ్యామేజీని రిపేరు చేసుకునే పనిలో పడింది. మునుగోడు నియోజకవర్గం నుంచి గతంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు గంగిడి మనోహర్ రెడ్డి రెండు ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, మునుగోడుకు అనివార్యంగా ఉపఎన్నికలను తీసుకువచ్చి, రాజగోపాల్ రెడ్డిని ప్రయోగించిన బీజేపీ ఇప్పుడు ఎటూ పాలుపోని స్థితిలో ఉంది. ఈ ఉపఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ను మునుగోడు నుంచి ఈ సారి బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 66 శాతానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో ప్రధానంగా బూర నర్సయ్య గౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు రమారమి 17 శాతం మంది ఉన్నారు. దీంతో ఈ సారి మునుగోడు నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలన్న యోచనలో ఉందంటున్నారు.తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీ నాయకుడిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ముందు నుంచీ పనిచేశారు. ఆ ఉద్యమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి నడిచారు. ఈ కారణంగానే 2014 లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్ సభా నియోజకవర్గం నుంచి ఆయనను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటికి నిలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. కానీ, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి రెండో సారి పోటీ చేసినా.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జిల్లా రాజకీయాల్లో ఆయనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పొసగలేదు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బరిలోకి దిగే ఆలోచనలు కూడా చేశారు. కానీ, ఇంతలోనే మునుగోడుకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ కు టికెట్ కూడా వస్తుందని ప్రచారం జరిగినా, బీఆర్ఎస్ నాయత్వం మాజీ ఎమ్మెల్యే, 2018 ఎన్నికల నాటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది.ఆ తర్వాత కొన్నాళ్లకే బూర నర్సయ్య గౌడ్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఈ శాసన సభ ఎన్నికల్లో ఆయన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. తొలి జాబితాలో ఆయనకు స్థానం దక్కలేదు. ఈలోగా మునుగోడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లిపోవడంతో.. మునుగోడులో ఈ సారి బీజేపీకి సరైన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్న నిశ్చిత అభిప్రాయానికి కమలనాథులు వచ్చినట్లు చెబుతున్నారు. కానీ, బూర నర్సయ్య గౌడ్ మనోభీష్టం మరో విధంగా ఉందని, ఆయన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ ఆశించడంతో పాటు, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలనుకుంటున్నారని ఆయన దగ్గరి అనుచరులు చెబుతున్నారు. దీంతో బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని, మునుగోడు అభ్యర్థి ఎవరు అవుతారన్న సస్పెన్స్ నెలకొని ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్