Sunday, September 8, 2024

మరో 9 ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ)

- Advertisement -

నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్

ఇప్పటికే 9 పాలిటెక్నిక్ లలో 17 ప్రోగ్రామ్స్ కు ఎన్బీఏ

కొద్ది రోజుల్లో అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు అక్రిడేషన్

విజయవాడ:  రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నేషనల్ బోర్డ్ ఆప్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) సాధించాలన్న సాంకేతిక విద్యా శాఖ ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తున్నాయని నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన వివరాలను అందిస్తూ ఇప్పటికే 9 పాలిటెక్నిక్ లలో 17 ప్రోగ్రామ్స్ కు ఎన్బీఏ దక్కగా, రాష్ట్రంలోని మరో తొమ్మిది ప్రభుత్వ పాలిటెక్నిక్ లు కొత్తగా ఎన్బీఏ గుర్తింపు పొందాయన్నారు. అన్ని పాలిటెక్నిక్ లు ఆదిశగా విజయం సాధించేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని వివరించారు. మొత్తం 16 ప్రోగ్రామ్లలో తొమ్మిది పాలిటెక్నిక్ లకు నూతనంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ నుండి గుర్తింపు లభించిందని సురేష్ కుమార్ వివరించారు. పాలిటెక్నిక్ విద్యను అంతర్జాతీయ స్దాయి ప్రమాణాల మేరకు నిర్వహించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన దిశలో ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ ను ఉన్నత స్ధాయి ప్రమాణాల మేరకు తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణ దుర్గం , అముదాలవలస, గుంటూరు, నంద్యాల, కలికిరి, పార్వతీపురం, రాజంపేట, కాకినాడ, ధర్మవరం, చంద్రగిరి, ఆత్మకూరు పాలిటెక్నిక్ లు వేర్వేరు బ్రాంచ్ లలో ఎన్బీఏ గుర్తింపును దక్కించుకున్నాయన్నారు.

తొలిదశలో 41 ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు ఎన్బీఏ కోసం ప్రయత్నించగా, ఇప్పటి వరకు 18 పాలిటెక్నిక్ లు ఎన్బీఏ గుర్తింపు పొందాయి. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ లు ఉండగా మిగిలిన 46 పాలిటెక్నిక్ లలో 43 సంస్ధలకు 2024-2025 విద్యా సంవత్సరంలో గుర్తింపు వచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని సురేష్ కుమార్ స్పష్టం చేసారు.  అయితే నూతనంగా మూడు పాలిటెక్నిక్ లు ప్రారంభించగా వీటికి మూడు సంవత్సరాల తరువాత ధరఖాస్తు చేయవలసి ఉంది. ఎన్బీఏ ప్రమాణాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ లను తీర్చి దిద్దటంలో సాంకేతిక విద్యా శాఖ విశేష కృషి చేసింది. అక్రిడిటేషన్ ఆవశ్యకతను గుర్తిస్తూ అయా సంస్ధలలో విప్లవాత్మకమైన మార్పులకు సాంకేతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. వృత్తిపరమైన విద్యా రంగంలో నాణ్యత, ఔచిత్యానికి హామీ ఇచ్చి, అత్యున్నత స్థాయి విశ్వసనీయతను నిర్ధారించడం ధ్యేయంగా అంతర్జాతీయ ప్రమాణాల అక్రిడిటింగ్ ఏజెన్సీగా భారత్ లో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యా వ్యవస్థలో బోధన, స్వీయ-మూల్యాంకనం, జవాబుదారీతనం, నాణ్యతా ప్రమాణాల పెంపు, నిపుణుల తయారీ వంటి అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది.

national-board-of-accreditation-nba-for-9-more-government-polytechnics
national-board-of-accreditation-nba-for-9-more-government-polytechnics

రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్బీఏ: చదలవాడ నాగరాణి

రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్ లకు ఎన్బీఏ లభించే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నేషనల్ బోర్డు ఆప్ అక్రిడిటేషన్ గుర్తింపు సాధనలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లకు నూతనత్వాన్ని ఆపాదిస్తున్నాయన్నారు. విద్యార్ధులకు ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్న దానిని కూడా ఎన్బీఏ పరిగణనలోకి తీసుకుంటుదని , ఆక్రమంలో వారికి తక్షణం ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదనపు అన్ లైన్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అయా  కళాశాలలోని అన్ని విభాగాలు ఆధునికతను సంతరించుకున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రతతో మొదలు భవనాలకు రంగులు వేయటం, ప్రయోగశాలల ఆధునీకరణ, విద్యార్ధులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ ఇలా మార్పులకు ఆస్కారం ఏర్పడిందన్నారు. విద్యార్ధుల వసతి గృహాలు సైతం మెరుగు పరిచామని, ఫలితంగా ఒక కొత్త ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్ధ నడిచేందుకు మార్గం సుగమమైందని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్