Sunday, September 8, 2024

నేషనల్ స్పోర్ట్స్ డే… చలో మైదాన్

- Advertisement -

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి : ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 29 (వాయిస్ టు డే  ): జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్యర్యంలో “నేషనల్ స్పోర్ట్స్ డే” సందర్భంగా ‘చలో మైదాన్” అంశంగా ఆటలపై అవగాహన కార్యక్రమంను ఘనం గా కొత్తగూడెం లో మంగళవారం నిర్వహించారు.  స్థానిక ప్రకాశం స్టేడియం లో  ఈ వేడుక లో ముఖ్య అతిధిగా  వనమా వెంకటేశ్వర రావు  శ్రీమతి కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్, శ్రీ రాంబాబు, అడిషినల్ కలెక్టర్ గారు, శ్రీమతి సులోచన, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి,  పుల్లయ్య, కొత్తగూడెం తహసీల్దార్ గారు హాకీ లెజండ్ ద్యాన్ చాంద్ గారి ఫోటోకి పూల మాలతో సత్కరించటం జరిగినది. ముఖ్య అతిధిగా విచ్చేసిన గౌరవ శ్రీ వనమా వెంకటేశ్వర రావు  మాట్లాడుతూ ద్యాన్ చాంద్ గారి జీవితం ఆదర్శప్రాయం అన్నారు.  క్రీడలకు ఆయన చేసిన సేవలను గురించి వివరించారు.  క్రీడల వలన  మానసిక ఉల్లాసం వస్తుందని అన్నారు.  కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండాలి అంటే ప్రతి రోజు విధిగా మైదానానికి వెళ్లి వ్యాయామం చేయాలని అన్నారు. అడిషినల్ కలెక్టర్ రాంబాబు మాట్లాడుతూ చదువే కాకుండా ఆటలు కూడా జీవితం లో ఒక భాగం కావాలని అన్నారు. హార్ట్ ఫుల్ నెస్ టీం వారు కూడా యోగ మెడిటేషన్ యొక్క ఉపయోగాలు గురించి తెలియ చేసినారు.

national-sports-day-chalo-maidan
national-sports-day-chalo-maidan

“నేషనల్ స్పోర్ట్స్ డే” సందర్భంగా 100,400 మీటర్లు రన్ పోటీలు నిర్వహించి విన్నర్ & రన్నర్ లకు బహుమతి ప్రధానం చేసేరు.  ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి సి.యం.కప్ పోటీలు మరియు ఆల్ ఇండియా సివిల్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు మేమొంటోలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి సులోచన,  కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం. పరందామ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్