National Students Day Celebrations :
జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు
కోరుట్ల, టౌన్ జూలై 09 :
:అఖిల భారత విద్యార్థి పరిషత్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జులై 09
ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా
పట్టణంలోని పాత మున్సిపల్ ఎదుట ఉన్న ఏబీవీపీ జెండా వద్ద ఏబీవీపీ జెండా ఎగుర వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు…
ఈ సందర్బంగా కోరుట్ల నగర కార్యదర్శి మడవేణి సునీల్ మాట్లాడుతూ
కేవలం 5 మందితో మొదలై జాతీయవాద భావాలతో విద్యార్థుల సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .. జ్ఞానం ! శీలం!!ఏకత!!!…పరిషత్ ప్రత్యేక…అంటూ క్షణం క్షణం మా కణం కణం… భారతమాతకే సమర్పణం… జనంలోని జ్యోతులం….జాతికొరకు వెలుగుదాం… అంటూ దేశంలో విద్యార్థి సమస్యలే కాకుండా, విపత్తులు సంభవించినప్పుడు కూడా ముందుంటూ దేశ పునరనిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ఏకైక విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని, జాతీయ జెండా కొసం దేశం కొసం ప్రాణ త్యాగాలు చేసిన రామన్న, గోపన్న జితేందర్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ లాంటి వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అన్నారు.అలాగే విద్యార్థి పరిషత్ ఆవిర్భావం రోజునే జాతీయ విద్యార్థి దినోత్సవం గా జరుపుకుంటాం ఆని తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఎస్ విభాగ్ కన్వీనర్ పవన్ ,సంజీవ్,మహదేవ్,వికాస్, మణిదీప్,మనీష్,పవన్, దక్షిణామూర్తి,తిలక్, నితీష్ కుమార్, రాకేష్, పూర్వ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



