నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. పరీక్షల షెడ్యూలు

- Advertisement -

క్యాలెండర్ ప్రకటించిన ఎన్ టీఏ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19:  దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)’  ప్రకటించింది. ఎన్టీఏ ప్రకటించిన పరీక్షల షెడ్యూలులో నీట్, జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది.

ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.

➥ నీట్ యూజీ ప్రవేశ పరీక్షను మే 5 దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. పెన్ను పేపర్/ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

➥ సీయూఈటీ (యూజీ) ప్రవేశ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

➥ సీయూఈటీ (పీజీ) ప్రవేశ పరీక్షను మార్చి 11 నుంచి 28 మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

➥ యూజీసీ నెట్ సెషన్-1 పరీక్షను జూన్ 10 నుంచి 21 కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను.. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. ఇక, నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular